NationalNews

కరోనా ఫోర్త్ వేవ్… భయమక్కర్లేదా…

దేశ వ్యాప్తంగా శాంతించినట్టుగా ఉన్న కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ముంబైలో కరోనా పాజిటివిటీ రేటు 15 శాతాన్ని దాటడంతో ఆందోళన ఉధృతమవుతోంది. దేశంలో నాలుగో వేవ్ రాబోతుందా అన్న వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయ్. ఓవరాల్ గా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయ్. ఈ నెల ఆరంభం నుంచి కేసుల సంఖ్య పెరుగుతోంది. రోజుకు వెయ్యికి పైగా కేసులు బయటపడగా… ఇప్పుడా సంఖ్య డబుల్ దాటింది. నిన్న ఒక్క రోజులో 15 వేల మందికి పరీక్షలు నిర్వహించగా… పాజిటివిటీ రేటు 15.11 శాతంగా నమోదయ్యింది. ముంబైలో గురువారం 24 గంటల్లో 2255 కేసులు నిర్ధారణ అయినట్టు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఐతే ఫోర్త్ వేవ్ వచ్చేస్తోందంటూ వస్తున్న హెచ్చరికలపై వైద్యులు ఆచితూచి స్పందిస్తున్నారు. ముంబైలో ప్రస్తుతం వస్తున్న కేసులన్నీ కూడా ఒమిక్రాన్ వేరియంట్‌వేనని అంటున్నారు. ఈ ఏడాది జనవరిలో రోజుకు 20 వేల కేసులు నమోదయ్యాయని… ఏప్రిల్ లో ఢిల్లీలోనూ కేసులు అధికంగా నమోదైనా… వెంటనే తగ్గాయంటున్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చినా పెద్ద ప్రమాదమేమీ లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కేసులు నమోదవుతున్నా… రోగులు వేగంగా కోలుకుంటున్నారని… రికవరీ 97 శాతం ఉందని అధికారులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ దాదాపు పూర్తయినందున… కరోనాకు భయపడాల్సిన పని లేదన్న వర్షన్ విన్పిస్తున్నారు ఎక్స్‌పర్ట్స్.