NationalNews

పోలీసుల నాగిని డ్యాన్స్‌ చూశారా..?

దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. అయితే.. ఈ వేడుకల్లో పోలీస్‌ సబ్‌-ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌ అనుచితంగా నాగిని పాటకి డ్యాన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్‌ ప్రపంచంలో హల్‌చల్‌ చేశాయి. పోలీసుల తీరుపై దీంతో నెటిజన్లు మండిపడటంతో ఉత్తరప్రదేశ్‌ అధికారులు చర్యలు చేపట్టారు. ఇద్దరు పోలీసులను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ ఘటన ఆగస్టు 15న ఫిలిబిత్‌లోని పురాణాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో జరిగింది. పోలీసు డ్రెస్‌లోనే వారు డ్యాన్స్‌ చేస్తుండగా.. మరికొందరు వారిని ఉత్సాహపరుస్తూ కనిపించారు. అయితే.. వీరి డ్యాన్స్‌ వివాదస్పదంగా మారింది. ఇండిపెండెన్స్‌ డే రోజున సంబంధం లేని పాటకు డ్యాన్స్‌ చేయడమేంటంటూ నెటిజన్లు ఫైర్‌ అయ్యారు.