10 మంది పిల్లల్ని కంటే రూ.13 లక్షల నజరానా
దేశ జనాభా తగ్గుతోందని ఆందోళనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ జనాభా పెంచుకోవడం కోసం సోవియట్ కాలంలో అమల్లో ఉన్న ఓ పురస్కారాన్ని మళ్లీ పునరుద్ధరించారు. జనాభాను విస్తరించే దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకు గాను …ఆదేశ మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. 10 మంది అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలను ‘మదర్ హీరోయిన్’ అవార్డుతో సత్కరిస్తామని చెప్పారు. అలాగే మిలియన్ రూబెల్స్ (భారత కరెన్సీలో దాదాపు 13 లక్షలకు పైన) బహుమతిగా ఇస్తామని పుతిన్ సర్కార్ ప్రకటించింది. అయితే దీనికో మెలిక కూడా పెట్టింది. 10వ బిడ్డ మొదటి పుట్టిన రోజు నాడు ఈ నగదు చెల్లిస్తామని అయితే అప్పటికి మిగతా 9 మంది సంతానం జీవించి ఉండాలని షరతు పెట్టారు.

