వైసీపీ ప్రభుత్వం పై పవన్ కార్టున్ ట్వీట్
వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి జనసేన అధినేత చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరయ్యే విషయంలో క్రమశిక్షణ ముఖ్యం అన్నట్టు యాప్ను వైసీపీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్ ద్వారా పాఠశాలకు వెళ్లిన వెంటనే వారు తమ హాజరును అందులో నమోదు చేయాల్సిఉంటుంది. “ ఈ ప్రక్రియ ఉపాధ్యాయులను ఏం చేస్తున్నారో ట్రాక్ చేసే విధంగా మాత్రమే కాకుండా ఎమ్మెల్యేలు , ఎంపీలు ఏం చేస్తున్నారో ట్రాక్ చేసేలా కూడా యాప్ ఉంటే బాగుంటుందంటూ రాసుకొచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ . అప్పుడే ఎవరు ఏమి చేస్తున్నారో అందరికి అర్ధం అవుతుందన్నారు. బాధ్యత అనేది ఎప్పడూ ఒకరికే ఉండకూడదని… అందరికి ఒకేలా ఉండాలి ” అని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులను ఒత్తిడికి గురిచేయడం వైసీపీ ప్రభుత్వాని భావ్యం కాదన్నారు. ఈ మేరకు ట్వీట్టర్ వేదికగా స్పందించిన పవన్ , ఒక కార్టున్ జోడించారు. దానిలో ఉపాధ్యాయులు అంతా సెల్ ఫోన్స్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నట్టు ఉంటుంది. అదేవిధంగా ఆ స్కూల్ అటెండర్ మాట్లాడుతూ ఓ వ్యక్తితో ఈ విధంగా చెబుతాడు “ పాపం రాగానే పిల్లలకు పాఠాలు చెప్పేవారు , కానీ అదేదో యాప్ అంట దాని సిగ్మల్ కోసం చెట్టుకొకరు , పుట్టకొకరు తిరుగుతున్నార్సార్! అని ట్వీట్ చేశారు.

