NationalNews

పాల ధరలు పెరిగాయి .. పారాహుషార్

మన దైనందిన జీవితంలో ఎంతో అవసరమైన, ఎన్నో పోషకాలు కలిగిన పాల ధరలు ఒక్కసారిగా చుక్కలను తాకాయి. దీంతో సామాన్యుడి మీద పెనుభారం పడింది. ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థలైన అమూల్,మదర్ డైరీలు పాల ధరలను పెంచుతున్నట్లుగా ప్రకటించాయి. లీటరు పాలపై 2 రూపాయల మేర పెంచుతున్నట్లు ఆ సంస్థలు వెల్లడించాయి.

ఈ విధంగా పాల ధరలను పెంచడం గత ఆరు నెలలలో ఇది రెండవసారి. అయితే పెరిగిన  ధరలు ఇప్పటికే అమలులోకి వచ్చేశాయి. పెట్టుబడులు పెరగడంతోనే  అమూల్ పాల ధరలను పెంచుతున్నట్లు గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. మదర్ డైరీ కూడా ఇదే తరహాలో పాల ధరలను పెంచినట్టు తెలిపింది.