Breaking Newshome page sliderHome Page SliderNewsTelangana

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల వ్యూహంపై కేసీఆర్‌ కీలక భేటీకి సిద్ధం

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేఖర్‌రావు (KCR) జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రధాన నేతలతో సమావేశం కానున్నారు. ఈ చర్చ గురువారం ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో జరగనుంది. నియోజకవర్గానికి చెందిన క్లస్టర్‌ ఇన్‌చార్జులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

ఇప్పటికే నామినేషన్‌లు, పరిశీలన ప్రక్రియ పూర్తయి పోటీ దారుల తుది జాబితా ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు మొత్తం ఫోకస్‌ ప్రచార వ్యూహాలపై ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు ఎన్నికల్లో విజయం సాధించేందుకు మార్గదర్శనం ఇవ్వనున్నట్లు సమాచారం.

ప్రచారానికి రంగంలోకి దిగబోయే స్టార్‌ క్యాంపెయినర్లకు అనుసరించాల్సిన విధానాలు, ప్రచార ధోరణులు, స్థానిక స్థాయిలో సమన్వయం వంటి అంశాలపై కేసీఆర్‌ స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు అనేక కీలక నేతలు పాల్గొననున్నారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్‌ఎస్‌ ఈ సమావేశం తర్వాత తుది ప్రచార వ్యూహాన్ని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.