Breaking Newshome page sliderHome Page SliderNewsTelangana

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కేసీఆర్ కీలక సమీక్ష

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కీలక నాయకులు కేటీఆర్, హరీశ్‌రావుతో కలిసి జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం ఎర్రవల్లి ఫాంహౌస్‌లో జరిగినట్లు సమాచారం.

పార్టీ అభ్యర్థి విజయాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల వ్యూహం, ప్రచార ప్రణాళిక, నాయకుల బాధ్యతల విభజనపై కేటీఆర్, హరీశ్‌రావు కేసీఆర్‌కు వివరించినట్లు వర్గాలు చెబుతున్నాయి.

రేపు జరగనున్న బీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జ్‌ల సమావేశం అజెండాపైనా ఈ ముగ్గురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లో పార్టీ విజయాన్ని సాధించేందుకు ముమ్మర ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని బీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.