రైతుల కోసం కాదు, కుర్చీల కోసం పోరాడుతున్న కాంగ్రెస్
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మాత్రం అధికార పోరాటాల్లోనే మునిగిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను మరిచిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “రైతు బంధు లేదు, రుణమాఫీ కాలేదు, బోనస్ బోగస్ అయిపోయింది. రైతుల ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి” అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి, అంతర్గత లాభాల కోసం “నీకెంత, నాకు ఎంత” అనే వాటాల పంచాయితీల్లో నిమగ్నమైందని కేటీఆర్ విమర్శించారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజలే బదులు చెబుతారని హెచ్చరించారు.