జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు AIMIM మద్దతు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతున్న వేళ, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కీలక నిర్ణయం ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు తమ పార్టీ మద్దతు తెలుపుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల్లో నవీన్ యాదవ్ విజయం సాధించి జూబ్లీహిల్స్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించిన ఓవైసీ, “అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగడం ఇప్పుడు అత్యవసరం. గత పదేళ్లలో రాష్ట్రంలో పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయి” అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి AIMIM కార్యకర్తలు, స్థానిక కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఓవైసీ మద్దతుతో జూబ్లీహిల్స్లో రాజకీయ సమీకరణాలు మరోసారి మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.