Home Page Sliderhome page sliderInternationalNewsviral

ట్రంప్ వార్నింగ్ లెక్కచేయని ఇరాన్..మొస్సాద్ పై దాడి

ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ బేఖాతరు చేసింది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడి చేసింది. డైమోన న్యూక్లియర్ ప్లాంట్‌పై కూడా ఇరాన్ దాడి చేసింది. అలాగే ఇజ్రాయెల్‌లో మరిన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైళ్లను ప్రయోగిస్తోంది. టెల్ అవీవ్‌లోని మొస్సాద్ కార్యాలయాన్ని ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటించగా …ఇజ్రాయెల్ దాన్ని ఖండించింది.