రాత్రి వేళలోనే ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు.. ఎందుకంటే..
ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ మొదలై దాదాపు ఆరు రోజులైంది. ఇజ్రాయెల్ అత్యాధునిక మిస్సైల్స్, డ్రోన్స్ తో దాడులకు పాల్పడుతుంటే ఇరాన్ మాత్రం ముఖ్యంగా ఇజ్రాయెల్ పై రాత్రి వేళల్లోనే ఎక్కువగా క్షిపణి దాడులు చేయడాన్ని వ్యూహంగా పెట్టుకొంది. ప్రత్యర్థిని గందరగోళం, ఆశ్చర్యం, షాక్‌కు గురిచేయడానికి ఇది బాగానే ఉపయోగపడుతోంది. కానీ, నిశిరాత్రి దాడి చేయడం వెనుక కొన్ని సాంకేతికంగా తప్పనిపరిస్థితులు, మానసిక యుద్ధతంత్రం వంటివి ఉన్నాయి. ఇజ్రాయెల్ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఆ వ్యూహం ఏమిటంటే..ఇరాన్ వద్ద ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక విమానాలు లేవు. ఉన్నవి కూడా పాత తరం అమెరికా, సోవియట్ రష్యా విమానాలే. ఇవి ఇజ్రాయెల్‌కు చేరాలంటే మాత్రం.. ఇరాక్, సిరియా, సౌదీ, జోర్డాన్, లెబనాన్ తదితర దేశాల్లో కొన్నింటి గగనతలాలపై నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ, ఆయా దేశాలు చూస్తూ తమ గగనతలాన్ని అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్‌పై దాడికి వాడుకోనివ్వవు. ఈ నేపథ్యంలో కచ్చితంగా క్షిపణులను రాత్రి వేళలో ప్రయోగించడమే ఇరాన్ కు ఉన్న మార్గం.

