చెక్ డ్యామ్‌ను బాంబులతో బ్లాస్ట్ చేసిన అధికారులు
తెలంగాణ నిర్మల్ జిల్లాలోని చెక్ డ్యామ్‌ను అధికారులు పేల్చేశారు. వర్షా కాలం నేపథ్యంలో వరద ముప్పు నివారణకు కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీకి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు గుర్తించారు. దీంతో జీఎన్ఆర్ కాలనీ సమీపంలోని స్వర్ణ వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్‌ను బాంబులతో బ్లాస్ట్ చేశారు.

