వామ్మో.. పులుల దాడిలో ఒకే రోజు ఇద్దరి మృతి
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పులులు ఒకే రోజు ఇద్దరి ప్రాణాలు తీశాయి. నాగబీడ్ తాలూకా వడోణా గ్రామా నికి చెందిన మారుతి షిండే తన భార్యతో కలిసి సమీప అడవిలోకి తునికాకు సేకరణ కోసం వెళ్లారు. సేకరిస్తున్న క్రమంలో అతనిపై హఠాత్తుగా పులి దాడిచేసింది. తీవ్రంగా గాయపడి మారుతిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. జిల్లాలోని మూల్ తాలుకా బదూరణ గ్రామానికి చెందిన రుషి పెందోర్ మేకల కాపారి రోజూ మాదిరిగానే మేపేందుకు అడవికి వెళ్లాగా.. పులి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. నెల రోజుల వ్యవధిలోనే చంద్రపూర్ జిల్లాలో పులుల దాడిలో 8 మంది మృతి చెందారు.

