కొండా సురేఖ అంత మాట అనేశారేంటి..?
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. కొందరు మంత్రులు ఫైల్స్ క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ‘నా దగ్గరకు కూడా ఓ కంపెనీ వాళ్లు ఫైల్ క్లియరెన్స్ కోసం వచ్చారు. మీ ఒక్క రూపాయి కూడా నాకు వద్దు అని వాళ్లతో చెప్పాను. బదులుగా ఆ డబ్బుతో సమాజ సేవ చేయమని వాళ్లకు సూచించాను’. అని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ లోని క్రిష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో 5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

