మోదీకి ముందే తెలుసు..ఖర్గే ఆరోపణలు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి గురించి మోదీకి ముందే తెలుసని ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిందని ఖర్గే ఆరోపించారు. ఆ తర్వాతనే ప్రధాని తన రష్యా పర్యటనను రద్దు చేసుకున్నారన్నారు. ఏప్రిల్ 22 పహల్గాం దాడి ఘటనకు 3 రోజుల ముందుగానే ఇంటెలిజెన్స్ రిపోర్టు అందిందని ఖర్గే పేర్కొన్నారు.

