త్రీడీ ప్రింట్‌లో బ్లాక్ బస్టర్ మూవీ…ఎంత కష్టపడ్డారో?
1990లో రిలీజై తెలుగు ప్రేక్షకులను మరోలోకానికి తీసుకుపోయిన చిత్రం జగదేకవీరుడు..అతిలోకసుందరి. అందాల తార శ్రీదేవి అతిలోక సుందరిగా, మెగాస్టార్ చిరంజీవి జగదేకవీరుడిగా నటించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు మరోసారి ఈ చిత్రం 3డీ, 2డీ ప్రింట్‌లలో 8కే రెజల్యూషన్‌తో రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ చిత్రాన్ని రూపొందించిన వైజయంతి మూవీస్ మరోసారి దీనిని సిల్వర్ స్క్రీన్‌పై చూపించే ప్రయత్నం చేస్తోంది. ఈ చిత్రాన్నిమళ్లీ నిర్మించినంత కష్టపడాల్సి వచ్చిందని నిర్మాత స్వప్నదత్ పేర్కొన్నారు. పాడయిపోయిన రీల్‌ను సేకరించి, దానిని డిజిటల్ టెక్నాలజీకి మార్చడానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.8 కోట్లు ఖర్చయ్యిందన్నారు. 35 ఏళ్ల క్రిందట మే 9న రిలీజై సంవత్సరాల పాటు థియేటర్స్‌లో దుమ్ము దులిపిన ఈ చిత్రాన్ని మరోసారి మే 9నాడే రీరిలీజ్ చేస్తుండడం విశేషం.