పహల్గామ్ ఉగ్రదాడి అమెరికాకు ముందే తెలుసు..
పహల్గామ్ ఉగ్రదాడి గురించి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి అమెరికాకు ముందే తెలుసు అని కేఏ పాల్ బాంబు పేల్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడి సమాచారం అమెరికా ఇంటెలిజెన్స్ దగ్గర ఉందన్నారు. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే విషయానికి సంబంధించి వారి వద్ద రిపోర్ట్ ఉందని కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సౌదీ వాషింగ్ టన్ పోస్ట్ జర్నలిస్టును సౌదీ ఎంబసీలోనే ముక్కముక్కలు చేసి చంపారని, అది సౌదీ గవర్నమెంట్ వాళ్ల ప్రైవేట్ వ్యక్తులతో చేయించిందని తాను సమాచారం ఇచ్చానని తెలిపారు. దీన్ని ప్రపంచం మొత్తం ఖండించినా ట్రంప్ మాత్రం మిలియన్ డాలర్లు తీసుకొని సౌదీని కాపాడాడని ఆరోపించారు. రాజకీయంలో డబ్బుతో ఎవరినైనా కొనెసే కుట్రలు చేస్తున్నారని, చట్టాన్ని కూడా డబ్బుతో కొనేస్తున్నారని చెప్పారు. అందరూ జడ్జిలు అమ్ముడుపోకపోయినా.. కొందరు జడ్జిలు ఇష్టానుసారం వ్యవహరిస్తూమన దేశానికే అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

