ఇంటర్ ఫలితాలు విడుదల..
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మూల్యాంకనం పూర్తి కావడంతో నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేశారు. మార్చి 5 నుండి 25 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 4.88 లక్షల మంది ఫస్టియర్ పరీక్షలు రాయగా, 5 లక్షల మందికి పైగా సెకండియర్ పరీక్షలు రాశారు. గతేడాది కన్నా మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఈ సారి బాలికలదే పైచేయిగా ఉందని మంత్రి తెలిపారు. ఫస్టియర్‌లో 66.89 శాతం, సెకండ్ ఇయర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్, వెరిఫికేషన్‌కు వారం రోజుల గడువు ఇచ్చారు.