Home Page SliderNational

స్టేడియంలోని స్టాండ్ కు తన పేరు పెట్టడంపై రోహిత్ ఏమన్నాడంటే..

ముంబై వాంఖడే స్టేడియంలోని ఓ స్టాండ్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై రోహిత్ శర్మ స్పందిస్తూ… తాను ఆడే స్టేడియంలోని స్టాండ్ కు తన పేరు పెట్టడం అనేది నిజంగా నమ్మలేకపోతున్నానని చెప్పాడు. తన జీవితంలో ఇది అతి పెద్ద గౌరవం అని అన్నాడు. ఆట ఆడటం మొదలు పెట్టినప్పుడు మనం ఎంత కాలం ఆడతామో మనకు తెలియదని చెప్పాడు. మనం సాధించే విజయాలు, మైలురాళ్లను పక్కన పెడితే… ఇలాంటి గౌరవం సాధించడం, ఓ స్టాండ్ కు మన పేరు పెట్టడం వంటివి చాలా గొప్ప విషయం అన్నాడు. స్టేడియంలోని స్టాండ్ పై తన పేరు చూసుకున్నప్పుడు ఎంతో భావోద్వేగం కలుగుతుందని చెప్పాడు.