రీల్స్ కోసం నడిరోడ్డుపై పిచ్చివేశాలు..
బెంగళూ రులో ఓ వ్యక్తి రీల్ కోసం బిజీగా ఉన్న రోడ్డు మధ్యలో కుర్చీలో కూర్చొని టీ తాగుతూ రీల్స్ చేశాడు. అది కాస్తా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు ఇదేం పనిరా బాబు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రోడ్డుపై, ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఏంటా పిచ్చి వేషా లు అంటూ ఏకిపారేస్తున్నారు. ‘జా గ్రత్త సుమా.. బెంగళూరు పోలీస్ మిమ్మల్ని గమనిస్తోంది’ అంటూ పోలీస్ శాఖ ట్వీట్ చేసింది. ఆ వీడియో కాస్తా పోలీసుల కంట పడింది. ఈ క్రమంలోనే సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి మరోసారి చేయకుండా నాలుగు తగిలించి వార్నింగ్ ఇచ్చి పంపారు.