ఐపీఎస్ అధికారికి హైకోర్టు లో రిలీఫ్
తెలంగాణ ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి హైకోర్టులో ఊరట లభించింది. క్యాట్ లో విచారణ ముగిసేంత వరకు.. ఆయనను తెలంగాణలోనే కొనసాగేలా ఉత్త ర్వులివ్వాలని డీవోపీటీని న్యాయస్థానం ఆదేశించింది. ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ ఇటీవల మహంతికి డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన క్యాట్ ను ఆశ్రయించారు. అయితే స్టే విధించేందుకు క్యాట్ నిరాకరించడంతో మహంతి హైకోర్టు మెట్లెక్కారు.