Home Page SliderTelangana

కారు బీభత్సం.. బాలకృష్ణ ఇంటికి దూసుకొచ్చిన కారు

సినీ హీరో బాలకృష్ణ ఇంటి వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 1లో అతివేగంగా దూసుకెళ్లిన కారు బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫెన్సింగ్ తో పాటు కారు ముందు భాగం ధ్వంసమైంది. అయితే.. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 మీదుగా చెక్ పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి వుంది.