Home Page SliderNational

70వ చలనచిత్ర జాతీయ అవార్డులు వీరికే..

70వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. వీటిలో అత్యుత్తమ చిత్రంగా మలయాళ చిత్రం అట్టమ్ నిలిచింది. 2022నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు ఈ పురస్కారాలు ప్రకటించారు. పాన్ ఇండియా చిత్రం కాంతారలో నటించిన రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును చేజిక్కించుకున్నారు. ఉత్తమ నటిగా నిత్యమేనన్(తిరుచిట్రంబళం) తమిళచిత్రానికి, మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్) గుజరాతీ చిత్రానికి ఉమ్మడిగా ఎన్నికయ్యారు. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా హీరో నిఖిల్ నటించిన కార్తికేయ2 ఎన్నికయ్యింది. కన్నడలో కేజీఎఫ్2, తమిళంలో పొన్నియిన్ సెల్వన్1 ఎన్నికయ్యాయి. ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా బ్రహ్మాస్త్ర మూవీకి అర్జిత్ సింగ్, ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్‌గా బాంబే జయశ్రీ ఎన్నికయ్యారు. ఉత్తమ నేపథ్య సంగీతానికి పొన్నియన్ సెల్వన్ చిత్రానికి గాను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు అవార్డు దక్కింది.