వామ్మో… ఒక్కరోజులో 65 లక్షల మంది సినిమా హాళ్లకు..!
సినిమా ప్రేమికులు దేశ వ్యాప్తంగా ఒక్కరోజులో 65 లక్షల మంది సినిమాహాళ్లకు వచ్చారని మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భారతదేశంలో రికార్డు స్థాయిలో ప్రజలు సినిమాలకు వచ్చారు. టికెట్ ధరలను భారీగా తగ్గించడంతో ఒక్కరోజులో 65 లక్షల మంది సినీ ప్రేక్షకులు మల్టీప్లెక్స్‌లను సందర్శించారు. కేవలం టికెట్ ధర 75 రూపాయలు కావడంతో సినిమాలను వీక్షించేందుకు ఎగబట్టారు. సెప్టెంబర్ 23ని థియేటర్‌లలో అత్యధికంగా హాజరైన తేదీగా మార్చుతున్నట్టు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా MAI తెలిపింది.
ఒక రోజు చొరవకు భారతీయ సినీ ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చిందని… సినిమా టికెట్‌లకు అపూర్వమైన డిమాండ్ కారణంగా ప్రదర్శనలు ఉదయం 6:00 గంటలకు ప్రారంభించారంది. అన్ని వయసుల ప్రేక్షకులు ఒకచోట చేరారని… దేశంలోని సినిమా ఆపరేటర్లు రోజంతా హౌస్-ఫుల్ షోలను నడిచాయంది. సెప్టెంబర్ 23 సంవత్సరంలో అత్యధిక హాజరును నమోదు చేసిన రోజుగా పేర్కొంది. PVR, INOX, Cinepolis, Carnival, Miraj, Citypride, ASIAN, Mukta A2, Movie Time, Wave, M2K, Delite సినిమా చైన్‌లతో సహా దేశవ్యాప్తంగా 4,000 స్క్రీన్‌లు ఒక్క రోజులో ప్రదర్శించారు.