గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే..!
రాజస్థాన్‌లో గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇవ్వనున్నట్టు రాజస్థాన్ సర్కారు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుండి రాజస్థాన్‌లో వంట గ్యాస్ సిలిండర్ ధరలను ₹ 500 కు తగ్గించనున్నట్లు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి, ఉజ్వల పథకంలో చేరిన వారికి ₹ 500కి వంట గ్యాస్ సిలిండర్లను అందజేయనున్నట్టు రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం చెప్పింది.
బీజేపీపై పరోక్ష విమర్శలు చేస్తూ సీనియర్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో ముఖ్యమంత్రి ఈరోజు ప్రకటన చేశారు. ‘‘వచ్చే నెల బడ్జెట్‌కు నేను సిద్ధమవుతున్నాను… ప్రస్తుతం ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఉజ్వల పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ పేదలకు ఎల్‌పీజీ కనెక్షన్లు, గ్యాస్ ఓవెన్‌లు అందిస్తున్నారు. కానీ సిలిండర్ మాత్రం ఖాళీగానే ఉంది. ఎందుకంటే రేట్లు ఇప్పుడు ₹ 400 మరియు ₹ 1,040 మధ్య ఉన్నాయి” అని గెహ్లాట్ చెప్పారు.వచ్చే ఏడాది రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.