Andhra PradeshHome Page Slider

తిరుమలలో లడ్డూల తయారీకి 50 కోట్లతో యంత్రాలు

తిరుమలలో త్వరలో లడ్డూల తయారీకి ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన యంత్రాలు అందుబాటులోకి వస్తాయన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. శ్రీవారి లడ్డూల తయారీ కోసం 50 కోట్ల రూపాయలతో యంత్రాలు సిద్ధమవుతున్నాయన్నారు. తిరుమల మ్యూజియాన్ని ఈ ఏడాది చివరి నాటికి సిద్ధం చేస్తామన్నారు. శ్రీవారి ఆలయ ఆనందనిలయ బంగారు తాపడం పనులను ఆరునెలలపాటు వాయిదా వేస్తున్నామన్న ఈవో తేదీలను త్వరలో చెప్తామన్నారు. నిర్మాణం సజావుగా సాగేందుకు గ్లోబల్ టెండర్‌ను ఆహ్వానిస్తామన్నారు. భక్తులకు సేవలందించేందుకు TTDevastanam పేరుతో మొబైల్ యాప్ రూపొందించామన్నారు. ఈ యాప్ ద్వారా శ్రీవారి అన్ని సేవలు పొందొచ్చన్నారు. ఎస్వీబీసీ కార్యక్రమాలను లైవ్‌లో వీక్షించవచ్చన్నారు. జనవరి నెలలో తిరుమల 20.78 లక్షల మంది దర్శనం చేసుకున్నారని హుండీ కానుకలు రూ.123.07 కోట్లతోపాటుగా, లడ్డూ విక్రయాల ద్వారా సుమారుగా కోటి రూపాయల ఆదాయం వచ్చిందన్నారు.