ఏపీలో 4, తెలంగాణలో 13 రోజులు రాహుల్ యాత్ర ఇలా…
కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈనెల 18న ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించబోతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో నుంచి మంత్రాలయం వరకు 95 కిలో మీటర్ల మేర సాగనుంది. ఆ తర్వాత రాహుల్ గాంధీ యాత్ర 13 రోజుల పాటు తెలంగాణలో కొనసాగనుంది. ఏపీలో రాహుల్ యాత్రకు సంబంధించి పార్టీ కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించింది. 2024లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా మంజూలు చేస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్. బీజేపీ, దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతోందని… విభజించి, పాలించు నినాదంతో పాలిస్తోందనది దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఉమెన్ చాందీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ఏపీసీసీ చీఫ్ శైలజనాథ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.


