Home Page SliderNational

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 335 కరోనా కేసులు..

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 335 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా 5 గురు మృత్యువాతపడ్డారు. ఇందులో 4 మరణాలు కేరళలోనే నమోదు కాగా, యూపీలో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,701 గా ఉంది. ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 5,33,317 కు చేరింది.