ఆర్టీసీలో 3వేల ఉద్యోగాలు..మంత్రి
తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీలో త్వరలోనే 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కరీంనగర్‌లోని 33 విద్యుత్ బస్సులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. విద్యుత్ బస్సుల కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. త్వరలోనే ఈ బస్సులు హైదరాబాద్ సహా జిల్లాలలోనూ నడుస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్ రింగురోడ్డు లోపల డీజిల్ బస్సులను తగ్గించడం ద్వారా కాలుష్యం తగ్గుతుందని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడ్డాక ఆర్టీసీని దినదినాభివృద్ది చేస్తున్నామని మంత్రి తెలిపారు. త్వరలోనే ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందని పేర్కొన్నారు.