InternationalNews

21 ఏళ్లకే టిక్‌టాక్ స్టార్ మేఘా ఠాకూర్ కన్నుమూత

మేఘా ఠాకూర్, టిక్‌టాక్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, 21 ఏళ్ళ వయసులో మరణించారు. బాడీ పాజిటివిటీని ప్రోత్సహించడంలో మేఘా ప్రసిద్ధి చెందింది. డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సంపాదించింది. కెనడియన్ టిక్‌టాక్ స్టార్ మేఘా ఠాకూర్ “అకస్మాత్తుగా, ఊహించని విధంగా” మరణించినట్లు ఆమె తల్లిదండ్రులు ప్రకటించారు. మేఘా వయసు 21. టిక్‌టాక్‌లో 9 లక్షల 30 వేల మంది అనుచరులను కలిగి ఉన్న ఠాకూర్, బాడీ పాజిటివిటీని ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందింది. ఆమె ప్రొఫైల్ నుండి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, నవంబర్ 24న మేఘా మరణించినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. బరువైన హృదయాలతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నామని తల్లిదండ్రులు ప్రకటించారు. మేఘా ఠాకూర్, నవంబర్ 24, 2022 న తెల్లవారుజామున హఠాత్తుగా, అనుకోకుండా మరణించారని వారు రాసుకొచ్చారు.

నమ్మకమైన వ్యక్తి… స్వతంత్ర భావాలున్న వ్యక్తిగా మేఘాను తల్లిదండ్రులు అభివర్ణించారు. మరణాన్ని అభిమానులందరికీ తెలియజేయాలని కోరుకుందని… ఈ సమయంలో, ఆమెను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నామన్నారు. మేఘా ఠాకూర్‌కు ఏడాది వయసున్నప్పుడే తల్లిదండ్రులు కెనడాకు వెళ్లారు. 2019లో మేఫీల్డ్ సెకండరీ స్కూల్ నుండి పాసైన తర్వాత, ఆమె వెస్ట్రన్ యూనివర్శిటీలో చేరారు. కాలేజీలో చేరిన వెంటనే ఆమె టిక్‌టాక్‌లోకి ప్రవేశించింది. ఆమె వీడియోలు తరచుగా కైలీ జెన్నర్, బెల్లా హడిద్ వంటి ప్రముఖ ప్రముఖుల సూచనలను కలిగి ఉంటాయి. మేఘా ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ప్రాచుర్యం పొందింది. 100,000 మంది ఫాలోవర్లను కలిగి ఉంది.