International

16మంది కెప్టెన్‌లు.. ఒక సెల్ఫీ

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ రేపటి నుండి ప్రారంభంకానుంది. ఈ టోర్నీ ప్రారంభంకానున్న సందర్భంలో మొత్తం 16 టీమ్‌ల ఫోటో షూట్ జరిగింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ 16 జట్ల కెప్టెన్స్‌తో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫోటోను ట్యాగ్ చేస్తూ మెస్ట్ లవ్డ్ సెల్ఫీ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ కాగా చాలా మంది దీనికి రీప్లైగా “ఈ సెల్ఫీలోని ఏ టీమ్ వరల్డ్ కప్‌తో ఫోటో తీసుకోనుందో వేచి చూడాలి” అని కామెంట్లు పెడుతున్నారు.

ఈ క్రమంలోనే ఈ నెల 23న జరిగే ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు సేల్ కాగా , దాదాపు 90వేల మంది ప్రేక్షకులు హాజరుకానున్నట్టు సమాచారం. మ్యాచ్ కేసం జరిగిన ఫోటో షూట్లో ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్ , బాబర్ ఫన్నీగా కనిపించారు. నవ్వుతూ వీరు ఇద్దరు దిగిన ఫోటో ప్రస్తుతం అందిరి దృష్టిని ఆకర్షిస్తుంది.