Andhra PradeshHome Page Slider

ఈనెల 13న ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు

ఏపీలో ఈనెల 13న ప్రభుత్వ ,ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా 13వ తేదీ సెలవుదినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌-సీఈవో) ముఖేష్ కుమార్‌ మీనా ఆదేశాలు జారీ చేశారు.ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోని షాపులు, స్కూళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు..