వేధింపులు భరించలేక 13 ఏళ్ల బాలిక ఆత్మహత్య..
వేధింపులు భరించలేక 13 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో జరిగింది. రోహిత్ అనే ఇంటర్ విద్యార్థి వేధిస్తున్నాడని బాలిక ఆరోపించింది. 2 రోజుల క్రితం బాలిక పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా మిమ్మల్ని పట్టించుకోలేదని వారు ఆవేదన చెందారు. బాలిక మీనాక్షి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని బాలిక తల్లిదండ్రులు కంటతడి పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.