బస్సులో మంటలు.. 11 మంది ఆహుతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారు జాము 5 గంటలకు నాసిక్-ఔరంగాబాద్ హైవేపై ఓ ప్రైవేటు లగ్జరీ బస్సులో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యారు. తీవ్రంగా గాయపడిన 34 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. నిజానికి అతి వేగంతో వెళ్తున్న లగ్జరీ బస్సు.. ట్రక్కును ఢీ కొట్టడం వల్లే మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వేగంగా ఉన్న బస్సు 50-60 అడుగుల దూరంలో పడిపోవడంతో డీజిల్ ట్యాంకర్ పగిలి మంటలు బస్సును అంటుకున్నాయని పేర్కొన్నారు.