NewsTelangana

తెలంగాణాలో టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

నేడు తెలంగాణాలో 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఆగస్టు 1 నుంచి 10 వ తేది వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు దాదాపు 55,662 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 204 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే తాజాగా విడుదల చేసిన ఈ సప్లిమెంటరీ  ఫలితాలలో 79.82% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను/https://www.bse.telangana.gov.in లేదా http:/www.manabadi.co.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చని అధికారులు తెలిపారు.