యానిమల్ సినిమా నిర్మాత 21 ఏళ్ల కుమార్తె మృతి
బాలీవుడ్ నిర్మాత క్రిషన్ కుమార్ కూమార్తె తీషా కుమార్ కన్నుమూశారు. తీషా 21 ఏళ్ల వయసులో మరణించింది. తిషా క్యాన్సర్తో బాధపడుతోంది. ఆమె క్యాన్సర్తో పోరాడుతూ మరణించింది. జర్మనీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తుది శ్వాస విడిచింది. తీషా T సిరీస్ భూషణ్ కుమార్ మేనకోడలు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన రణబీర్ కపూర్, రష్మిక మందన్న నటించిన యానిమల్ నిర్మాతలలో క్రిషన్ కుమార్ ఒకరు. తిషా ఇంతకు ముందు కొన్ని బహిరంగ ప్రదర్శనలు చేసింది. ఆమె చివరిగా నవంబర్ 30, 2023న యానిమల్ మూవీ ప్రీమియర్లో కనిపించింది.


