Home Page SliderTelangana

 పాతబస్తీలో క్షుద్రపూజల కలకలం

హైదరాబాద్‌లోని పాతబస్తీలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. పాతబస్తీ ప్రాంతంలో ఎవరో బాబా ఇచ్చారంటూ కొందరు ముస్లిం మహిళలు తాయెత్తులు భూమిలో పాతిపెడుతున్నారు.  సమాధుల వద్ద కోడిగుడ్లు, చికెన్ ముక్కలు కూడా దర్శనమిచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీనితో కొందరు యువకులు ఈ బాబాలను నమ్మొద్దని, ఇలా చెప్పేవారిని చెప్పుతో కొట్టాలని సూచిస్తున్నారు. అమాయక మహిళలను మోసం చేసి, వారి వద్ద నుండి అత్తమామలు, భర్తల ఫొటోలను తెప్పించుకుని ఈ క్షుద్రపూజలకు పాల్పడుతున్నారని అభియోగాలు చేస్తున్నారు. ఇలాంటి దొంగబాబాలను వెంటనే పట్టుకుని అరెస్టు చేయాలని పోలీసులను కోరుతున్నారు. మహిళలు తాయెత్తులు పాతిపెడుతున్న దృశ్యాలను పోలీసులు సీసీ టీవీ కెమెరాలలో గుర్తించారు.