రూ.1700కోట్లతో….ప్యాకప్
డిపాజిటర్లను ముంచి ఎంచక్కా దుబాయ్ చెక్కేశాడు ఫాల్కన్ చైర్మన్ అమర్‌దీప్ కుమార్.ఈ విషయాన్ని పోలీసులు తాపీగా చెప్పారు.ఫాల్కన్ బాధితులు వారాల తరబడి లబోదిబోమంటుంటే ఏదో కబురు చల్లగా చెప్పినట్లుగా ఆయన ఇక్కడ లేడంటూ పోలీసులు చెప్పడంతో ఆయన బాదితులు కొంత మంది సోమవారం ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేశారు. ఇప్పటికే భార్యాపిల్లలను దుబాయ్‌లో సెటిల్ చేసిన అమర్‌దీప్ ..ఇప్పుడు ఆయన కూడా దుబాయ్ వెళ్లిపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 14 షెల్ కంపెనీల ద్వారా డబ్బు మొత్తాన్ని విదేశాలకు తరలించిన అమర్‌దీప్ పై ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలో ఫాల్కన్ సంస్థలో మిగతా డైరెక్టర్ల కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు..ఫాల్కన్ సంస్థలో 9 మంది డైరెక్టర్ల కోసం 9 ప్రత్యేక బృందాల గాలింపు చర్యలు చేపట్టారు. డిపాజిట్ల రూపంలో రూ.1700 కోట్లు వసూల్ చేసిన ఫాల్కన్.. హైదరాబాద్‌లోనే రూ.850 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. ప్రముఖ కంపెనీలలో పెట్టుబడులు పెట్టి లాభాలు ఇస్తామంటూ నమ్మించి మోసం చేయడంతో డిపాజిటర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.