మోదీశకంలో శక్తివంతమైన దేశాలలో భారత్ స్థానం ఎంతంటే…
గతంలో ఎన్నడూ లేనిది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 25 దేశాల జాబితాలో భారతదేశం 3వ స్థానంలో నిలిచింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి గత 75 ఏళ్లుగా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే పిలువబడిన భారత దేశానికి నవశకం తీసుకువచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. రాజుల కాలంలో అంతులేని సంపదతో స్వర్ణయుగంగా పిలువబడింది భారత్. కానీ అనంతర కాలంలో మహ్మదీయుల దండయాత్రలతో, ఆంగ్లేయుల ఆక్రమణలతో వైభవాన్ని కోల్పోయిన భారత్ ఇప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. తిరిగి పూర్వవైభవాన్ని తెచ్చే మహత్తర బాధ్యతను తలకెత్తుకున్నారు ప్రధాని. దేశవిదేశాలలో మేటి అయిన ప్రధానిగా గుర్తింపు తెచ్చుకున్నారు. శక్తివంతమైన దేశాల జాబితాలో అమెరికా, రష్యా తరువాతి స్థానాలలో సగర్వంగా నిలిచింది. ఇక మొదటి స్థానం ఎంతో దూరంలో లేదు. మోదీ నాయకత్వాన్ని మరోసారి దేశప్రజలు కోరుకుంటే ఆరోజు త్వరలోనే రాబోతోందనే సంకేతాలు వస్తున్నాయి. మోదీ పాలనలో అభివృద్ధి చెందిన దేశంగా మారిన భారత్ వృద్ధిని ఒక్కసారి గమనిద్దాం.
GST యొక్క నెలవారీ పన్ను వసూళ్లు 1.4-1.5 లక్షల కోట్లు దాటింది
కొత్త సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో భారతదేశం రెండవ స్థానానికి చేరుకుంది
భారతదేశం యొక్క GDP 8.2 శాతానికి చేరుకుంది.
నీరు, భూమి మరియు ఆకాశం అనే మూడు ప్రాంతాల నుండి సూపర్‌సోనిక్ క్షిపణులను ప్రయోగించిన ప్రపంచంలోనే మొదటి దేశంగా భారతదేశం అవతరించింది
ఆర్మీకి బుల్లెట్‌ప్రూఫ్ స్కార్పియో రక్షణ కవచం లభించింది. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీకి 2500 బుల్లెట్‌ప్రూఫ్ స్కార్పియోలు లభించాయి
టెక్స్‌టైల్ ఉత్పత్తిలో ఇటలీని వదిలిపెట్టి, 2వ స్థానంలో నిలిచింది.
ఆటో మార్కెట్‌లో జర్మనీని 4వ స్థానంలో నిలిపివేసి 3వ స్థానానికి చేరింది.
ఆర్థిక వ్యవస్థలో బ్రిటన్‌ను మించి 5వస్థానంలో నిలిచింది.
విద్యుత్ ఉత్పత్తిలో రష్యాను 3వ స్థానానికి చేర్చి 2వ స్థానంలో చేరింది.
ఉక్కు, మొబైల్ ఉత్పత్తిలో 2వ స్థానానికి చేరుకుంది.
అంతరిక్ష పరిశోధనలలో గణనీయమైన వృద్ధి సాధించింది. సూర్య, చంద్రులపై ప్రయోగాలకై ఆదిత్య ఎల్1, చంద్రయాన్ 3 మిషన్లను పంపి ఇస్రోను నాసాతో సమానస్థాయికి చేర్చింది.
అన్నింటి కన్నా ముఖ్యంగా మోడీ ప్రభుత్వ హయాంలో కాశ్మీర్ లోయ నుండి ఉగ్రవాదులను నిర్మూలిస్తున్నారు. భారత్ పూర్తి స్థాయిలో శక్తివంతమైన దేశంగా అవతరించాలంటే ప్రధాని మోదీ మరోసారి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.