Home Page SliderNational

వేట మలుపు తిరిగింది.. బావిలో పులి, అడవి పంది..

మధ్యప్రదేశ్ లోని సియోనిలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. వేటాడే క్రమంలో పులికి ఎదురు దెబ్బ తగిలింది. ప్రాణం తీసేందుకు వెళ్లిన పులికి తన ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి వచ్చింది. అడవి పందిని వేటాడుతూ ఊహించని విధంగా పులి, అడవి పంది బావిలో పడిపోయాయి. తమ ప్రాణాలను కాపాడుకోడానికి ప్రయత్నం చెయ్యడం ఆసక్తిగా మారింది. బావిలో పరిస్థితిని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. పులి, అడవి పంది రెండు ఒకే చోట ఉండటంతో రెస్క్యూ చేయడం అధికారులకు కూడా సవాల్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతి కష్టంతో రెస్క్యూ సిబ్బంది రెండు జంతువులను బయటకు తీసి, అడవిలో వదిలేశారు.