నేను పోటీ చేస్తే గెలిచేవాడ్ని..బైడెన్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్‌పై తాను పోటీ చేసి ఉంటే గెలిచేవాడినని ప్రస్తుత అధ్యక్షుడు జోబైడన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డెమొక్రటిక్ పార్టీలో ఐక్యత కోసమే తాను పోటీ నుండి వైదొలగి, కమలాహారిస్‌కు అధ్యక్ష ఎన్నికలు అప్పగించానని పేర్కొన్నారు. ఆమె ట్రంప్‌ను ఓడించగలదని తాను భావించానని పేర్కొన్నారు. పదవుల కంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ముఖ్యమని, అందుకే అప్పట్లే ఎన్నికల రేసు నుండి తప్పుకున్నానని పేర్కొన్నారు. ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ సమర్థురాలేనని ప్రశంసించారు. తొలుత అధ్యక్షరేసులో నిలబడిన బైడెన్ సొంత పార్టీ నుండే వ్యతిరేకత రావడంతో అధ్యక్ష రేసు నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన, కమలాహారిస్‌కు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.