బ్రిటన్ ప్రధాని కొంప ముంచిన ఆ బంధం…
మంత్రులు తిరుగుబాటు చేయడంతో దిక్కులేని పరిస్ధితుల్లో బోరిస్ జాన్సన్ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకున్నారు.బోరిస్ ప్రధాని హోదాలో ఉండగానే చాలాకాలంగా సహజీవనం చేస్తున్న తన ప్రియురాలు క్యారీ సైమండ్స్‌ను గతేడాది రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. బోరిస్‌కు ఇది మూడో వివాహం. వివాహ బంధం విషయంలో గతంలో బోరిస్ విమర్శలు ఎదుర్కొన్నారు.ఆయనకు ఉన్న వివాహేతర సంబంధం గురించి అబద్దం చెప్పడంతో కన్జర్వేటివ్ పార్టీ పాలసీ బృందం నుంచి తొలగించారు. అయితే కరోనా కారణాల వల్ల ఈ వేడుక అతికొద్దిమంది సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. అందుకే ఇప్పుడు అందరినీ పిలిచి గ్రాండ్ వెడ్డింగ్ పార్టీ ఇవ్వాలని బోరిస్ నిర్ణయించుకున్నారు.
అందుకు ప్రధాని అధికారిక నివాసం ‘చెకర్స్’లో బోరిస్ ఏర్పాట్లు చేసుకున్నారు. బ్రిటన్ ప్రధాని కార్యాలయం 10 డౌన్ స్ట్రీట్‌లో ఉంటుంది. చెకర్స్ ప్రధాని అధికారిక నివాసం. ఈ భవన సముదాయంలో ప్రపంచ నేతలతో సమావేశాలు, విందు కార్యక్రమాలు, పార్టీలకు బ్రిటన్ ప్రధానులు ఉపయోగిస్తుంటారు. చెకర్స్‌లో జూలై 30న బోరిస్ పార్టీ ఇవ్వనున్నట్లు సమాచరం. ఇది ఎంతో గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. స్నేహితులు, కుటుంబసభ్యులకు ఇప్పటికే ఆహ్వానం అందించారు బోరిస్ జాన్సన్. చివరగా గ్రాండ్ పార్టీకి బోరిస్ ప్లాన్ చేశారు. రాజకీయంగా దెబ్బ తిన్నా వైవాహిక జీవితం సంతోషంగా గడుపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.