ఇంగ్లాండ్ ప్రధాని రాజీనామా చేస్తారా?
ఇంగ్లాండ్‌లో రాజకీయ సంక్షోభం పతకా స్థాయికి చేరుకుంటోంది. బోరిస్ జాన్సన్ కేబినెట్‌లో కీలకంగా ఉన్న ఆర్థిక మంత్రి రుషి సనక్, వైద్య మంత్రి సాజిద్ జావిద్ రాజీనామా చేయగా… తాజాగా మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. బోరిస్ జాన్సన్ దిగిపోవాలంటూ ఆర్థిక మంత్రితోపాటు, వైద్య శాఖ మంత్రి పదవికి ఇప్పటికే రాజీనామా చేయడంతో ఒక్కసారిగా సంక్షోభం నెలకొంది. తాజాగా మహిళ, శిశు సంక్షేమ మంత్రి క్విన్స్ మాట్లాడుతూ… రాజీనామా తప్ప ఆప్షన్ లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వంపై విశ్వాసం లేకపోవడంతో పదవికి రాజీనామా చేస్తున్నట్టు జూనియర్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ సైతం రిజైన్ చేశారు. కుంభకోణాలతో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం… ప్రజల మద్దతు కోల్పోయిందన్న ప్రచారం బ్రిటన్ మొత్తం జోరుగా సాగుతోంది.