కోవాక్సిన్ గుడ్ న్యూస్… 5 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సిన్
కరోనా మహమ్మరి ప్రపంచ దేశాలను వెంటాడుతూనే ఉంది. మన దేశంలో కూడా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాప కింద నిరులా రోజురోజుకూ కరోనా కేసులు
పెరుగుతున్నాయి. ఈక్రమంలో వర్షాకాలం ఆరంభంతో అటు వ్యాధులు ప్రజలకు సోకే అవకాశం ఉన్నందున భయాందోళనకు గురవుతున్నారు. ఎవరికి వారు తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ బయోటెక్ కోవాక్సిన్ టీకాలను 5- 12 ఏళ్ల లోపు చిన్నారులను టెక్నికల్ సబ్ కమిటీ సిఫార్స్ చేసింది. 6-12 చిన్నారులను ఉపయోగించేదుకు ఔషధ నియంత్రణ సంస్ధ డీసీజీఐ భారత్ బయోటెక్ అనుమతులు మంజురు చేసింది. ప్రస్తుతం దేశంలో రోజుకు రెండు వేల కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేట్, మరణాలు సంఖ్య తక్కువగానే నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల కారణంగా నాలుగో వేవ్ వచ్చే అవకాశం ఉందన్న ఆందోళనలు విన్పిస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను కరోన వ్యాప్తిని అరికట్టడం కోసం చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇప్పటి వరకు 18 ఎళ్లు నిండిన వారికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి స్ధాయిలో అందించారు. అర్హులకు బూస్టర్ డోస్ అందిస్తున్నారు.