Uk ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి కి రాజీనామా చేశారు.
కరోనా విజృంభణ తీవ్రంగా ఉన్న సమయంలో దాని కట్టడికి అమల్లో ఉన్న నిషేధాలు, నియమాలు ఉల్లంఘిస్తూ ప్రధాని జాన్సన్ అధికార నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ ఏరియాలో నిర్మాణ పనులు యధేచ్ఛగా నిర్వహించారని… ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని… ఆరోపణలు వచ్చాయ్. ప్రధాని విచ్చలవిడిగా పార్టీల్లో పాల్గొని బాధ్యతలు మరచారన్న విమర్శలు వెల్లువెత్తాయ్. పలు పార్టీలో జాన్సన్ స్వయంగా పాల్గొనడంతో ఆయన పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయ్. మొదట్లో ఒప్పుకోకపోయిన తర్వాత ఈ విషయాన్ని బోరిస్ స్వయంగా అంగీకరించారు. అందుకు క్షమాపణలు కూడా చెప్పారు. ప్రధానే అడ్డంగా నిబంధనల్ని ఉల్లంఘిస్తారా అంటూ ఇంటా బయట దుమ్మెత్తి పోశారు. రాజీనామా డిమాండ్లు కూడా అప్పటినుంచీ ఊపందుకున్నాయి.
2019 లో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన వివాదస్పద ఎంపీ క్రీస్ పించర్‌ను డిప్యూటీ చీఫ్ విప్ గా నియమిస్తూ జాన్సన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు బోరిస్ మెడకు చుట్టుకుంటోంది. పించర్ పై గతంలో ఉన్న లైంగిక ఆరోపణలు తనకు తెలియదని బోరిస్ చెబుతున్నా… ఆ విషయం బోరిస్‌కు ముందు నుంచీ తెలుసని తాజాగా వెల్లడయ్యింది. లైంగిక ఆరోపణలున్న ఎంపీకి కీలక పదవి కట్టబెట్టడమే గాక అడ్డంగా అబద్ధాలాడిన వ్యక్తి నాయకత్వంలో పని చేయలేమంటూ కీలక మంత్రులు రాజీనామా చేశారు. కానీ జాన్సన్ మాత్రం ఎవరేం చెప్పినా తనంత తానుగా తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో అధికారం అప్పగించారని… అర్ధాంతరంగా తప్పుకునేందుకు కాదంటూ ఫోజులు కొడుతున్నాడు. సమస్యలను ఆధిగమించి పరిస్ధితిని చక్కదిద్దుతానంటున్నాడు.