NationalNewsNews Alert

కాంగ్రెస్ నేతల ధర్నా….రాహుల్ గాంధీ అరెస్టు

Share with

సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నేతలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో పార్లమెంట్‌ నుంచి విజయ్‌చౌక్‌ వరకు కాంగ్రెస్‌ ఎంపీలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ఎంపీలు నిర్వహించిన ఈ భారీ ర్యాలీలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విజయ్‌చౌక్‌ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రాహుల్‌ గాంధీతో పాటు పలువురు ఎంపీలను అరెస్టు చేశారు. దీంతో పోలీసులతో రాహుల్‌ గాంధీ వాగ్వాదానికి దిగారు. ధర్నా చేయడానికి తమకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని రాహుల్‌ పోలీసులను ప్రశ్నించారు. మోడీపై రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. మోడీ దేశాన్ని రాజులాగా పాలిస్తున్నారని ఆరోపించారు. తమపై కక్ష్యపూరింగా మోడీ సర్కార్‌ వ్యవహరిస్తోందని ఆరోపించారు.