నరేంద్ర మోదీ ఒక రాజు.. రాహుల్ విసుర్లు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్ష ఉద్రిక్తంగా మారింది.రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ అవరణంలోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకు నిరసన ప్రదర్శన జరిపారు.విజయ్ చౌక్ వద్ద పోలీసులు రాహుల్ గాంధీని,ఇతర ఎంపీలను నిర్బంధంలోకి తీసుకున్నారు.అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రంజీత్ రంజన్, కేసీ వేణుగోపాల్, మానికం ఠాగూర్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, కే సురేశ్‌లను సైతం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.భారతదేశం ఒక పోలీసు రాజ్యంగా మారింది ఆ రాజ్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక రాజు” అని రాహుల్ గాంధీ అరోపించారు.
దీంతో రాహుల్ గాంధీ ట్విటర్‌లో పైర్ అయ్యారు.నియంత రాజ్యం చూశారా? శాంతీయుత నిరసనలు చేపట్టకూడదు.ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై చర్చించకూడదు. కానీ పోలీసులు, ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగింనా,మమ్మల్ని అరెస్ట్ చేసినా…మా గళాన్ని మీరు మూయలేరు.నిజం మాత్రమే ఈ నియంతృత్వానికి చరమగీతం పాడగలదు.అని రాహుల్ గాంధీ ట్విట్ చేశారు
రాహుల్ గాంధీని పోలీసులు చుట్టుముట్టిన క్రమంలో సుమారు 30 నిమిషాల పాటు ఉద్రిక్త వాతావరణ నెలకొంది. అనంతరం రాహుల్ గాంధీని ఎత్తుకెళ్లి బస్సు ఎక్కించారు. అప్పటికే ఆయనతో ఉన్న పలువురు ఎంపీలను బస్సు ఎక్కించారు. ‘పోలీసుల సూచనల మేరకే నిరసనల్లో పాల్గొన్నాం. విపక్షాలను పూర్తిగా తుడిచిపెట్టటం, మా గొంతులను నొక్కేసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలు కుట్ర చేస్తున్నారు. దానికి మేము భయపడం. మా పోరాటం కొనసాగుతుంది అని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.