ఈడీ విచారణ వాయిదా వేయండి-సోనియా గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో హాజరయ్యేందుకు సమయం కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీని కోరారు. వాస్తవానికి గురవారం విచారణకు హాజరుకావాల్సి ఉన్నా… పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నట్టు సోనియా ఈడీకి తెలిపారు. విచారణ మరికొద్ది రోజులు వాయిదా వేయాల్సిందిగా సోనియా విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యం కుదుటపడిన వెంటనే విచారణకు హాజరవుతానని చెప్పారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఆస్పత్రిలో చేరిన సోనియా రెండ్రోజుల క్రితం డిస్‌చార్జి అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యనేత, సోనియా తనయుడు రాహుల్ గాంధీని ఈడీ అధికారులు ఐదు రోజులుగా విచారిస్తున్నారు. ఇప్పటి వరుక రాహుల్ గాంధీని 50 గంటలుగా విచారించారు.