NationalNews

కాంగ్రెస్‌కి షాక్… ఉద్ధవ్ బాటలో జార్ఖండ్ సీఎం సోరెన్…

Share with

రాష్ట్రపతి ఎన్నికల పోటీ రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్డీయే కూటమి అభ్యర్ది ద్రౌపది ముర్ముకి ఆదరణ పెరుగుతూ వస్తోంది. నిన్నటివరకు ప్రతిపక్షాలతో కలిసి ఉన్న పార్టీలు కూడా ముర్ముకే మద్దతు ఇస్తున్నాయి. మాజీ సీఎం, శివసేన అధినేత  ఉద్ధవ్ థాక్రే,  ఒడిశాలోని అధికార బీజేడీ టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ జగన్‌లు కూడా ముర్ముకే మద్దతు పలకడం మనకు తెలిసిందే.  తాజాగా  సమాజ్ వాదీ పార్టీ మిత్రపక్షమైన ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు చెందిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదికి మద్దతిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.  గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసిన ముర్ము ఇటీవల రాష్ట్రంలో పర్యటించి అధికార పార్టీ జేఎంఎం మద్దతు కోరారు. జార్ఖండ్‌లో కాంగ్రెస్ మద్దతుతో జేఎంఎం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. కాంగ్రెస్‌తో జతకడుతూనే జేఎంఎం ఎన్డీయే అభ్యర్థికి మద్దతు తెలపడం విచిత్రం. యశ్వంత్ సిన్హాకు పలు విపక్ష పార్టీలు మద్దతు ఉపసంహరించుకున్నట్లు అయ్యింది. రాష్ట్రపతి ఎన్నికలకు ఇంకా 3 రోజుల సమయం ఉంది. జరుగుతున్న పరిణామాలను బట్టి దాదాపుగా ఎన్డీయే కూటమి అభ్యర్ది ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమైనట్లయ్యింది.