NationalNews

బీజేపీ అభ్యర్థికి జైకొట్టిన ఉద్ధవ్ థాక్రే

Share with

మహరాష్ట్ర రాజకీయాలలో చోటు చేసుకున్న… పరిణామాల దృష్ట్యా రాష్ట్రపతి అభ్యర్దిని ప్రకటించే విషయంలో ఉద్దవ్ థాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతిస్తున్నట్టుగా థాక్రే ప్రకటించారు. ఏక్‌నాథ్ షిండే శివసేన నుండి తిరుగుబాటు చేయడం.మహరాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం వంటి పరిణామాల నేపథ్యంలో బీజేపీ సారథ్యంలో ఎన్డీయే తరుపున రాష్ట్రపతి అభ్యర్దిగా ద్రౌపది ముర్ము రేసులో ఉన్న విషయం తెలిసిందే. అయితే  తమ పార్టీ తరుపున ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై శివసేన కీలక సమావేశంలో ముర్ముకు మద్దతివ్వాలని డెషిషన్ తీసుకొంది. శివసేన అధ్యక్షుడు ,మహరాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన ముంబయిలోని తన సొంత నివాసమైన మాతోశ్రీలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు అందరూ కూడా ఎన్డీయే అభ్యర్ది ద్రౌపది ముర్ముకే మద్దతు పలికాలని నిర్ణయించారు. ఒక ఆదివాసీ వర్గానికి చెందిన వ్యక్తి దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహిస్తున్న తరుణంలో ఆమెకు మద్దతివ్వడం సమంజసమని శివసేన భావించింది.

Read More: ద్రౌపది ముర్ముకు ఏపీలో ఘన స్వాగతం